Monday, December 23, 2024

ఆరోసారి ఇజ్రాయెల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: బెంజమిన్ నెతన్యాహు(73) ఇజ్రాయెల్ ప్రధానిగా ఆరోసారి నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానిగా ఎక్కువ కాలం సేవలందించిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఇజ్రాయెల్ పార్లమెంట్(నెస్సెట్)లోని 123 మంది సభ్యుల్లో ఆయనకు 63 మంది శాసనసభ్యులు మద్దతునిచ్చారు. 54 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. ఆయనకు మద్దతునిచ్చిన వారంతా రైట్ వింగ్ సభ్యులే. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, దానికి మద్దతునిచ్చిన అల్ట్రా ఆర్థడాక్స్ షాస్, యునైటెడ్ తోరా జుడాయిజం, ఫార్‌రైట్ ఓట్‌జుమా యెహుదిత్, మతపరమైన జియోనిస్ట్ పార్టీ, నోమ్ కు చెందిన శాసనసభ్యులంతా ఆయనకు మద్దతునిచ్చారు.

నెస్సెట్ తన కొత్త స్పీకర్ లికుడ్ చట్టసభ సభ్యుడు అమీర్ ఒహానాను ఎన్నుకుంది. గత ప్రభుత్వాలలో మాజీ న్యాయ మంత్రి, ప్రజా భద్రతా మంత్రిగా ఆయన పనిచేశారు. ఒహానా ఇజ్రాయెల్ నెస్సెట్ తొలి ‘గే’ స్పీకర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News