Monday, December 23, 2024

భూమికి చేరుకుంటున్న బెన్నూ గ్రహశకలం నమూనా

- Advertisement -
- Advertisement -

బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాను నాసా వ్యోమనౌక ఒసైరిస్‌ఎక్స్ భూమి మీదకు తీసుకు వస్తోంది. వచ్చే సెప్టెంబర్ 23 నాటికి ఈ నమూనా చేరుకోవచ్చు. 1999 rq36 అన్న పేరుతో బెన్ను గ్రహ శకలాన్ని వ్యవహరిస్తున్నారు. గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? జీవం ఎలా పుట్టింది ? తదితర పుట్టు పూర్వోత్తరాలను ఈ నమూనా ద్వారా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇది కీలక ఘట్టం.

విజయవంతంగా గ్రహశకలం నమూనా భూమికి చేరుకోబోతుండటం చెప్పుకోదగిన విషయం. ఇంతవరకు ఎన్నడూ చేపట్టని మిషన్. 2016 సెప్టెంబర్ 8 న ఒసైరిస్ వ్యోమనౌక ప్రయోగం జరిగింది. బెన్నూ గ్రహ శకలాన్ని ఈ వ్యోమనౌక 2018 లో చేరుకుంది. దాదాపు ఏడేళ్లు ఈ నౌక అంతరిక్షంలో గడిపింది. నమూనాను తీసుకు రావడం అన్న ది ఒక ఛాలెంజ్ . ఎందుకంటే అత్యధిక వేడి వాతావరణం,ప్రకంపనలు, భౌగోళిక చిక్కుల నుంచి ఆ శకలం నమూనాను రక్షించుకోవడం చాలా ముఖ్యం.

ఎప్పుడైతే ఈ నమూనా కాప్సూల్ భూమికి చేరుతుందో అప్పుడే దాన్ని భద్రపర్చడానికి శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తుంది. ఆ నమూనా ఉటా ఎడారిలో దిగగానే అక్కడి నుంచి కొత్త లేబొరేటరీకి తరలిస్తారు. హోస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ వద్ద వద్ద కొత్త లేబొరేటరీ నిర్మించారు. కొత్త లేబొరేటరీలో నమూనాలను పరిశీలించడం ప్రారంభిస్తారు. దానిలో నాలుగో వంతు వివిధ ప్రాంతాల శాస్త్రవేత్తలకు అందించి పరిశోధన ముమ్మరం చేస్తారు. గ్రహాలు ఏర్పడేటప్పుడు కొన్ని ప్రాచీన అవశేషాలు మూలం నుంచి మిగిలిపోయాయి. ఈ అవశేషాలే గ్రహ శకలాలు. వీటిలో పూర్వగాముల జీవి తాలూకు పరమాణువులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News