Sunday, December 22, 2024

బెంజ్ కారు భీభత్సం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బెంజ్ కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టిన సంఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేసింది. కారు అదుపు తప్పి బంజారాహిల్స్, మహాప్రస్థానం వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు రెండు టైర్లు విడిపోయి, కొంత దూరం ఎగిరి పడ్డాయి. కారు భీభత్సం సృష్టించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ వాచ్‌మెన్ కుటుంబం గుడిసెలో నివాసం ఉంటున్నారు. వారికి కొద్ది దూరంలోనే కారు చెట్టుకు ఢీకొని ఆగిపోవడంతో వాచ్‌మెన్ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది.

కారు ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో యువతికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇంత జరిగినా కారు డ్రైవింగ్ చేసిన యువతి ఏమి ఎరగనట్లు కారుదిగి నడుచుకుంటూ వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. కారును సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News