Sunday, December 22, 2024

ప్రమాదానికి 5 సెకండ్ల ముందే బ్రేకు వేశారు

- Advertisement -
- Advertisement -

Benz interim report on Mistry's car accident

మిస్త్రీ కారు ప్రమాదంపై బెంజ్ మధ్యంతర నివేదిక

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడీస్ బెంజ్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొనడానికి ఐదు సెకండ్ల ముందు కారును నడుపుతున్న వ్యక్తి బ్రేకులు వేయడం జరిగిందని మెర్సిడీజ్ బెంజ్ కంపెనీ పాల్ఘర్ పోలీసులకు సమర్పించిన తన మధ్యంతర నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి గురైన కారును తనిఖీ చేయడానికి హాంకాంగ్ నుంచి మెర్సిడీజ్ బెంచ్ కంపెనీకి చెందిన నిపుణుల బృందం సోమవారం ముంబై రానున్నట్లు ఒక సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. గత ఆదివారం మధ్నాహ్నం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ(54)తోపాటు ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలె మరణించగా కారును డ్రైవ్ చేస్తున్న అనహిత పండోలె(55), ఆమె పక్కనే ఉన్న ఆమె భర్త దారియస్ పండోలె(60) గాయపడ్డారు. గుజరాత్ నుంచి ముంబై తిరిగివస్తున్న వీరి కారు పాల్ఘర్ జిల్లాలోని సూర్య నది వంతెనపై కారు డివైడర్‌ను ధ్వంసమైంది. మెర్సిడీజ్ బెంజ్ తన మధ్యంతర నివేదికను పోలీసులకు సమర్పించిందని, ప్రమాదం జరగడానికి కొద్ది సెకండ్ల ముందు వరకు కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని ఆ నివేదికలో పేర్కొందని పాల్ఘర్ ఎస్‌పి బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News