- Advertisement -
రోమ్: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో ఎటువంటి పదవులు చేపట్టకుండా ఆరేళ్లపాటు నిషేధానికి గురైన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లెస్కోని తన 86వ జన్మదినోత్సవం వేళ మళ్లీ ఇటలీ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాలపాటు ఇటలీ రాజకీయాలలో చెరగలేని ముద్ర వేసిన బెర్లుస్కోని మోంజా నగరం నుంచి పార్లమెంట్ ఎగువ సభకు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 50 శాతానికి పైగా వోట్లను సాధించుకున్న బెర్లుస్కాని తాను నిర్వహించే పత్రికా కార్యాలయాలకు సంబంధించి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు నిరూపితం కావడంతో 2013లో ఎటువంటి అధికారిక పదవులు చేపట్టకుండా ఆరేళ్లపాటు నిషేధానికి గురయ్యారు. 2011లో ప్రధానిగా మూడవ పర్యాయం ఆయన పదవీకాలం ముగిసింది.
- Advertisement -