Monday, December 23, 2024

సర్వమత సమానత్వంలో భేష్ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి :తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచి అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం ఇస్తూ, లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని, భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశానికి బలం అని నమ్మే సిఎం కెసిఆర్ ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పెనుబల్లి మండలం, నీలాద్రిశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి పూర్ణకుంభంతో, మేళతాళాలతో ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచరణతో స్వామి వారి ఆశీర్వాదం తీసుకొని దశాబ్ది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ పండగలకు ప్రత్యేక కానుకలు ధూప దీప నైవేద్యాలకు నిధులు అర్చకులకు వేతనాలు, అన్ని మతాల పండగలకు కానుకలను ఇస్తూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని తెలిపారు .

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు , ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, నీలాద్రిశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వరరావు, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, రెడ్డెం వీర మోహన్ రెడ్డి, జెడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, సొసైటీ అధ్యక్షులు చింతనీప్పు సత్యనారాయణ, చెక్కిలాల లక్ష్మణరావు, మందడపు అశోక్ కుమార్, లగడపాటి శ్రీను, గోదా చెన్నారావు, యడ్ల సుబ్బారావు, చీకటి అజిత్ , కొడిమెల్ల అప్పారావు, భద్రారెడ్డి, తన్నీరు కృష్ణయ్య, క్షత్రియ నాయక్, తుము శ్రిను, లక్ష్మణరావు, కోమటి ప్రసాద్, ఈఓ వెంకట రమణ తదితులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News