Thursday, January 23, 2025

‘ట్రై కలర్’ను విడుదల చేసిన బెస్ట్ ఆగ్రోలైఫ్

- Advertisement -
- Advertisement -

అగ్రోకెమికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ (BAL) ఆగస్టు 23 న తెలంగాణలోని మేడ్చల్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో BAL యొక్క తాజా శిలీంద్ర సంహారిణి “ట్రై కలర్”ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో 750 కంటే ఎక్కువ మంది డీలర్‌లు పాల్గొన్నారు. BAL విడుదల చేసిన సరికొత్త ఆవిష్కరణ “ట్రై కలర్ “. దీని ప్రయోజనాలు, ఉపయోగాలను డీలర్లకు ఈ కార్యక్రమం లో పరిచయం చేశారు. ట్రిఫ్లోక్సీస్ట్రోబిన్ 10% + డైఫెనోకోనజోల్ 12.5% + సల్ఫర్ 3% SC యొక్క శక్తివంతమైన మిశ్రమంతో కూడిన ఈ అత్యాధునిక శిలీంద్ర సంహారిణి సమగ్ర వ్యాధి నియంత్రణ చర్యలను అందిస్తుంది. దీని ప్రత్యేక కూర్పు కారణంగా అగ్గి తెగులు, బూజు తెగులు, స్కాబ్, ఆల్టర్నేరియా వంటి విస్తృతమైన పంట వ్యాధులను సమర్థవంతంగా నిరోధిస్తుంది. మూడు క్రియాశీల పదార్ధాల ఏకీకరణ మెరుగైన సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది, వరి, టమోటా, ద్రాక్ష, మిరపకాయ, గోధుమలు, మామిడి, ఆపిల్ యొక్క ఆరోగ్యకరమైన పంటలకు దోహదం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో వినూత్న ఆవిష్కరణలు, స్థిరమైన పరిష్కారాల ద్వారా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు BAL చూపుతున్న నిబద్ధతను ప్రదర్శించారు. బెస్ట్ ఆగ్రోలైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతులు, వ్యవసాయ సమాజంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ట్రై కలర్ కు ఉందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “తెలంగాణలోనే కాకుండా భారతదేశం అంతటా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో, రైతాంగం యొక్క శ్రేయస్సును పెంపొందించడంలో ట్రై కలర్ కీలక పాత్ర పోషిస్తుంది” అని అన్నారు. బెస్ట్ ఆగ్రోలైఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ SBVR ప్రసాద్ మాట్లాడుతూ “ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతును చేరుకోవాలనే లక్ష్యంతో బహుళజాతి కంపెనీలతో పోటీ గా ధరలను అందిస్తున్నాము” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News