Friday, December 20, 2024

ఏషియన్ సన్‌సిటీలో బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ కొత్త కార్యాలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

అగ్రోకెమికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్, హైదరాబాద్ నగరంలో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ దాని వేగవంతమైన వృద్ధి పథంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. పశ్చిమ ప్రాంతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలో బలమైన ఉనికిని కలిగిన బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్, అగ్రోకెమికల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటి. కంపెనీ దక్షిణాది వ్యాపారానికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది.

దేశంలోని మొత్తం వ్యవసాయ రసాయన వ్యాపారంలో హైదరాబాద్‌తో సహా దక్షిణ మండలం 35% వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ వంటి కీలక రాష్ట్రాలను కలిగి ఉన్న వెస్ట్ జోన్‌కు సెంట్రల్ హబ్‌గా కూడా హైదరాబాద్ కీలక స్థానాన్ని కలిగి ఉంది, కంపెనీ దేశవ్యాప్త వ్యాపారంలో సమిష్టిగా 30% కు ఇది తోడ్పాటునందిస్తుంది.

కొండాపూర్‌లోని ఏషియన్ సన్‌సిటీలో కొత్తగా స్థాపించబడిన కార్యాలయం, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ కేంద్రాలలో ఒకటైన శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో వుంది. ఇది ఫైనాన్షియల్ సిటీ, గచ్చిబౌలికి సమీపంలో ఉంది. బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ వ్యూహాత్మక కార్యక్రమాలలో కొత్త కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని ఏషియన్ సన్‌సిటీలో బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ యొక్క కొత్త కార్యాలయం కంపెనీ యొక్క శ్రేష్ఠత, కస్టమర్-సెంట్రిక్ విధానానికి నిదర్శనంగా నిలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News