న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ అగ్రోకెమికల్స్ కంపెనీ బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ (BAL). మొదటిసారిగా BAL, ఆచార్య ఎం జి రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ, బాపట్లతో కలిసి వ్యవసాయ విద్యార్థి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రారంభించింది. వ్యవసాయ గ్రాడ్యుయేట్లకు ఉత్పత్తి పరిజ్ఞానం అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
డాక్టర్ దగ్గుబాటి విజయ్ సాయిరామ్ కుమార్, ప్రొఫెసర్, ఎంటమాలజీ, ఇన్‌ఛార్జ్ ప్లేస్‌మెంట్ సెల్ మరియు సారా నర్సయ్య, బిజినెస్ యూనిట్ హెడ్, హైదరాబాద్, ఇంటర్న్స్ & సేల్స్ టీమ్‌ను ఉద్దేశించి భవిష్యత్ వ్యవసాయ పోకడల గురించి వెల్లడించారు . ఈ సమావేశాన్ని బెస్ట్ ఆగ్రోలైఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమం జీప్ ప్రచారంతో ప్రారంభమైంది, దీనిలో అగ్రి-ఇంటర్న్‌లు తమ నైపుణ్యాలు మరియు విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు. ఈ ప్రచారం బెస్ట్ ఆగ్రోలైఫ్ బ్రాండ్ మరియు దాని సమగ్ర ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో గురించి అవగాహన కల్పించడంలో సహాయపడింది.
“ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని, వ్యాపార వృద్ధికి, రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంటర్న్‌లకు అద్భుతమైన అవకాశం, వారు ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ విద్యార్థులు అనుభవజ్ఞులైన నిపుణుల నుండి నేర్చుకోవడానికి, వ్యవసాయ రంగంలో ప్రయోగాత్మక అనుభవాన్ని పొందడానికి ఇది సహాయపడుతుంది. వారు తమ విజ్ఞానం, నైపుణ్యాలను విస్తరింపజేస్తారని, కంపెనీ విజయానికి దోహదపడతారని నేను విశ్వసిస్తున్నాను” అని బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ అలవాది అన్నారు.
బెస్ట్ ఆగ్రోలైఫ్ బృందం కొత్త పంట పరిష్కారాలు, సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన, సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ సమావేశాన్ని మందేష్ (మార్కెటింగ్ మేనేజర్-గుంటూరు), నర్సయ్య (హెడ్, సేల్స్ & మార్కెటింగ్, హైదరాబాద్, నారాయణ రెడ్డి (డిప్యూటీ జనరల్ మేనేజర్), నాగిరెడ్డి (రీజనల్ సేల్స్ మేనేజర్) నిర్వహించారు.వ్యవసాయ-ఇంటర్న్‌లకు అద్భుతమైన టెక్నికల్ ప్రెజెంటేషన్‌ని అందించి విజయవంతం చేసిన గోపు అజయ్ రెడ్డి (మార్కెటింగ్ మేనేజర్ -టిఎస్), సాంబిరెడ్డి (రీజినల్ సేల్స్ మేనేజర్ -విజయవాడ)కు బెస్ట్ ఆగ్రోలైఫ్ బృందం ధన్యవాదములు తెలిపింది.