Monday, January 27, 2025

జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఉత్తమ అవార్డు

- Advertisement -
- Advertisement -

మంత్రి చేతుల మీదుగా అందుకున్న జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్

Best Award for Vikarabad District Hospital Superintendent

మన తెలంగాణ/తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతా శిశు జిల్లా ఆసుపత్రిలో అత్యధికంగా డెలవరీలు నిర్వహించినందుకు గాను ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఉత్తమ అవార్డు లభించింది. శుక్రవారం రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ శుక్రవారం ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిశంకర్ మాట్లాడారు. జనవరిలో 554, పిబ్రవరిలో 580, మార్చి నెలలో 661 డెలవరీలు నిర్వహించనట్లు వివరించారు. అత్యధికంగా సాధారణ కాన్పులు నిర్వహించడం జరిగిందని, అదే విధంగా సాధారణ కాన్పులు పెంచేలా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో మొత్తం 1795 డెలవరీలలో సాధారణ కాన్పులు 1006, సీజెరియన్ 789 చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, ప్రజలకు, ప్రజా సంఘాలకు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News