Monday, January 20, 2025

టిహబ్‌కు దేశంలోనే అత్యుత్తమ అవార్డు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిహబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమమైన నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని టిహబ్ సొంతం చేసుకున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టిహబ్ సిఇఒ శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

టి-హబ్ నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ని సొంతం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న టి-హబ్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. టి-హబ్ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందిందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News