35మంది పోలీసులకు అందించిన సిపి మహేష్‌భగవత్
మరింత ఉత్సాహంగా పనిచేయాలి
సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : అవార్డులకు ఎంపికైన పోలీసులు ముందు ముందు మరింత ఉత్సాహంగా పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పోలీస్ మెడల్‌కు ఎంపికైన పోలీసులకు శుక్రవారం ఆయన మెడల్స్ అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 35మంది పోలీసులు మెడల్స్‌కు ఎంపికయ్యారని తెలిపారు. గత ఐదేళ్లలో ఇదే చాలా ఎక్కువని, ఎఆర్‌ఎస్సై సత్యవరప్రసాద్, హెచ్‌సి సుబ్బారెడ్డి ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారని తెలిపారు.
మెడల్స్‌కు ఎంపికైన వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని అన్నారు. అవార్డులు, రివార్డులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వర్తించేందుకు పనిచేస్తాయని అన్నారు. మంచిగా పనిచేసి డిపార్ట్‌మెంట్, కుటుంబానికి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. పోలీసులు ప్రతి రోజు కొత్తగా భావించి పనిని ప్రారంభించాలని అన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులు ఓపిగా ఉండాలని, సమయస్ఫూర్తిగా ఉండాలని కోరారు. అవార్డులు చేసిన పనికి గుర్తింపని అదనపు పోలీస్ కమిషనర్ సుదీర్‌బాబు అన్నారు. అవార్డు తీసుకున్న వారు మరింత జాగ్రత్తగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో డిసిపి రక్షితమూర్తి, డిసిపి శిల్పవల్లి, ఎడిసిపి ఎఆర్ శమీర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో…
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 83మంది పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన వారికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అందజేశారు. ఇందులో ఒకరికి ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం, మోహన్నట సేవ పతకం, ఉత్తమ సేవ తొమ్మిది మందికి, 75మందికి సేవ పతకం అవార్డుకు ఎంపికయ్యారు. ఎడిసిపి నుంచి పిసి వరకు అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికైన పోలీసులకు నగర సిపి అంజనీకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అవార్డులు పొందిన వారు మరింత మంచిగా పనిచేసి డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. పోలీసులు చట్టాని లోబడి పనిచేయాలని, అవార్డులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు పనిచేస్తాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, డిసిపి సునీత తదితరులు పాల్గొన్నారు.