Monday, December 23, 2024

డబిల్ పూర్‌కు ఉత్తమ బయో డైవర్సిటీ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని ఉత్తమ బయోడైవర్సిటీ అవార్డు డబిల్ పూర్ గ్రామానికి దక్కింది. రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డ్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గీత భాగ్యరెడ్డి అవార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. మేడ్చల్ మండలంలో ఉత్తమ బయోడైవర్సిటీ అవార్డు డబిల్ పూర్ గ్రామానికి దక్కడంతో కార్మికశాఖ

మంత్రి మల్లారెడ్డితో కలిసి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులను సిఎం అభినందించారు. కార్యక్రమంలో బండ మాదారం సర్పంచ్ శ్యామల ప్రభాకర్ రెడ్డి, డబిల్ పూర్ ఉప సర్పంచ్ నారాయణ, వార్డు సభ్యులు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News