ఇటీవల జియో ఎయిర్ టెల్, ఐడియా రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అనేక వినియోగదారులు తమ సిమ్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీలో అతి తక్కువ , సరసమైన ప్లాను ఉండడం. బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు ఆకర్షించేందుకు అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అందులో భాగంగా ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 199 ఒకటి. ఇది ఎన్నో ప్రయోజనాలతో చౌకైన, సరసమైన ప్లాన్. ఇందులో అనేక ప్రజోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199 చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 2జీబీ డేటా వస్తుంది. డేటా పరిమితి తర్వాత ఇంటర్నెట్ 40Kbpsకి తగ్గుతుంది. అంటే.. ఒక విధంగా ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అపరిమిత డేటా పొందుతారు. బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో కస్టమర్‌లకు ప్రతిరోజూ 100 SMSలు కూడా అందిస్తుంది. అంతేకాకుండా.. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 30 రోజుల పాటు BSNL ట్యూన్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.