Monday, December 23, 2024

బెస్ట్‌ హైదరాబాద్‌ చెఫ్‌ సీజన్‌ 2 పోటీలు ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మరోమారు హైదరాబాద్‌ మహిళలకు తమ పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించుకునే అవకాశం వచ్చింది. మరీ ముఖ్యంగా హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలలో నివాసముంటున్న మహిళలకు! గత సంవత్సరం అపూర్వ విజయం సాధించిన ఇంటర్‌ హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ లైవ్‌ కుకింగ్‌ పోటీలు మరో మారు నగరంలో జరుగుతున్నాయి. నగరంలో దాదాపు 30కుపైగా హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రతి గేటెడ్‌ కమ్యూనిటీ నుంచి ఒక విజేతను ఎన్నుకుని వారి తో ఫైనల్స్‌ను నిర్వహించి ‘బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ సీజన్‌ 2’ విజేతగా ఒకరిని ఎంపిక చేయనున్నారు.

ఈ పోటీలకు టైటిల్‌ స్పాన్సర్‌గా రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ వ్యవహరిస్తుంటే, అసోసియేట్‌ స్పాన్సర్‌గా ఫ్రీడమ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌, స్వస్తిక్‌ స్పైసెస్‌, పవర్డ్‌ బై పార్టనర్‌గా దేశీ న్యూట్రి, డ్రివైన్‌బై పార్టనర్‌గా మహవీర్‌ స్కోడా మరియు జెమ్‌ సుజుకీ, హాస్పిటాలిటీ పార్టనర్‌గా లైమ్‌ బొటిక్‌ హోటల్‌ వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీలకు ఇస్కాన్‌ అత్తాపూర్‌, రిసైకల్‌ ఫౌండేషన్‌ మద్దతు అందిస్తున్నాయి.

ఈ సందర్భంగా రత్నదీప్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. హోమ్‌ చెఫ్స్‌ తమ అంతర్గత ప్రతిభను చాటే అవకాశం దీని ద్వారా కల్పించడంతో పాటుగా తమ కమ్యూనిటీతో మరింతగా బంధం ఏర్పరుచుకునే అవకాశమూ అందిస్తున్నాము’’ అని అన్నారు.

కుకింగ్‌ ప్రేమికులకు ఓ వేదికగా బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ సీజన్‌ 2 నిలువనుందని ఫ్రీడమ్‌ హెల్తీ ఆయిల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ పి చంద్రశేఖర రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని అన్ని గేటెడ్‌ కమ్యూనిటీలలో నూతన కలినరీ ప్రేమికులను సృష్టించనున్నామని స్వస్తిక్‌ స్పైసెస్‌ ప్రతినిధులు అన్నారు. ఈ పోటీలు మసాలెదార్‌ విజయం సాధించాలని వారు అభిలాషించారు.

దేశీ న్యూట్రి బిజినెస్‌ హెడ్‌ గోవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ తమ బ్రాండ్‌ మిల్లెట్‌, మిల్లెట్‌ ఆధారిత ఆహారాన్ని అందిస్తుందని, మా వినియోగదారులను నేరుగా చేరుకునే అవకాశం ఈ పోటీ తమకు అందిస్తుందన్నారు. ఎస్‌ఐపీఎల్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ ప్రవీణ్‌ కె అగర్వాల్‌ మాట్లాడుతూ సీజన్‌1 కు అపూర్వ స్పందన లభించిందని, ఆ స్ఫూర్తితోనే సీజన్‌ 2 ప్రారంభించామంటూ జాతీయ స్థాయి పోటీలుగా వీటిని నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News