Monday, December 23, 2024

చలికాలంలో ఇలా చేస్తే జలుబు రాదు…

- Advertisement -
- Advertisement -

 

చలికాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు ఓసారైనా ప్రతి ఇంటినీ పలకరిస్తాయి.వాటినుండి బయటపడాలంటే కనీసం ఓ వారం రోజులైనా యాంటీ బయాటిక్స్ తీస్కోవాల్సిందే మరి.అలాగని అందరూ యాంటీ బయాటిక్స్ తీసుకోవడానికి ఇష్టపడకనూ పోవచ్చు కదా.సరిగ్గా అలాంటివారి కొరకు ఇంటి వద్ద తయారుచేసుకుని చప్పరించే దగ్గు,జలుబు బిళ్ళలు.తీవ్రమైన ఫ్లూ కూడా ఈ బిళ్ళలు వాడితే మటుమాయం కావాల్సిందే.మరి వాటి తయారీ విధానాన్ని ఓ సారి చూసి,చేసేయడమే…

కావాల్సిన పదార్థాలు : చక్కెర- ఒక కప్పు, నీళ్ళు- అర్ధ కప్పు, నిమ్మరసం- ఒక టీ స్పూన్(విటమిన్-సి పుష్కలం), తేనె- ఒక టీ స్పూన్(యాంటీ బాక్టీరియల్ మరియు సహజంగానే దగ్గు తగ్గించే శక్తి కలదు), శొంఠి పొడి- ఒక టీ స్పూన్(ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరుస్తుంది,సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది మరియు నాజియా లక్షణాలను తగ్గిస్తుంది), లవంగాల పొడి- పావు టీ స్పూన్(యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలది).

తయారుచేసే విధానం :

1.ప్యాన్‌లో ఒక కప్పు చక్కెర వేయాలి.
2.చక్కెరలో అర కప్పు నీళ్ళు కలిపి స్టౌ పైన ఉంచి మీడియం ఫ్లేం లో ఉంచాలి.
3.ఒక టీ స్పూన్ నిమ్మరసం ఉడికే పాకంలో కలపాలి.
4.ఒక టీ స్పూన్ తేనె కూడా కలపాలి.
5.శొంఠి పొడి కూడా ఒక టీ స్పూన్ వేయాలి.
6.కొంచం వేడి చేసిన లవంగాలను పొడిచేసి,పావు టీ స్పూన్ పొడిని మరిగే పాకంలో కలపాలి.
7.పాకాన్ని సిమ్‌లో ఉంచి 15-20 నిమిషాలు (ముదురు పాకం వచ్చేవరకు) మరిగించాలి.
8.ముదురుపాకం రాగానే స్టౌ మీద నుండి తీసేసి,ప్లేట్‌లో బట్టర్‌పేపర్ పరిచి దానిపై పాకాన్ని చిన్న చిన్న బిళ్ళల సైజులో వేయాలి.
9.దాని పైన ఐసింగ్ షుగర్ లేదంటే బియ్యం పిండి చల్లాలి.
10.ఇరవై నిమిషాల తరువాత(చల్లారింతర్వాత) బిళ్లలుగా తయారవుతాయి.
ఇలా తయారైన బిళ్ళలను నిల్వ ఉంచుకోవచ్చు.
11.తయారైన బిళ్ళలను చప్పరించడం ఇష్టంలేనివారు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News