Monday, April 28, 2025

ఉత్తమ పోలీసులకు రివార్డులు

- Advertisement -
- Advertisement -

అందజేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: రివార్డులు వచ్చిన పోలీసులు మరింత కష్టపడి పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబర్చిన పోలీసు సిబ్బందికి శుక్రవారం ఆయన రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ ఏడాది నుంచి వర్టికల్స్‌లో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. గత నెల కూడా 22 ఫంక్షనల్ వర్టికల్స్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 17 ఫంక్షనల్ వర్టికల్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉందని అన్నారు.

సిబ్బంది ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. మొదటి స్థానంలో ఉన్నామని, మరింత బాధ్యతతో పనిచేయాలని అన్నారు. పీర్ టు పీర్ లెర్నింగ్‌తో ఒకరికొకరు సహకరించాలని అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్‌ను వరుసగా టాప్‌ప్లేస్‌లో ఉంచేందుకు కృషి చేస్తున్న ఎసిపి శివభాస్కర్‌ను అభినందించారు. కార్యక్రమంలో డిసిపి కల్మేశ్వర్, సిసిఆర్‌బి ఎసిపి శివభాస్కర్, ఎసిపి రవీందర్, ఇన్స్‌స్పెక్టర్ యాదగిరి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News