Monday, January 27, 2025

నీలిమకు ఉత్తమ మహిళా రైతు పురస్కారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/తొర్రూరు : రసాయనిక వ్యవసాయంతో విసిగి వేసారి కొన్నేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మహిళా రైతు లోకానికే ఆదర్శంగా నిలిచింది. రైతు కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థ రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళ రైతు పురస్కారాన్ని అందజేసి గౌరవించింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా మీడియేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళ పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్తమ మహిళా రైతు కేటగిరి విభాగంలో తొర్రూరుకు చెందిన మహిళా రైతు మంగళపల్లి నీలిమ కృష్ణమూర్తి రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు పురస్కారాన్ని సుప్రీంకోర్టు జడ్జి హిమా కోహ్లీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

నీలిమా తొర్రూరు మండల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు, రసాయనాలు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. రసాయనాలు వాడటం వలన నేల నిస్సారం అవుతుందని భావించి సేంద్రియ సాగుకు పూనుకుంది. ఈ సందర్భంగా నీలిమా మాట్లాడుతూ.. చిన్న మహిళా రైతునైనా నాకు ఇంత పెద్ద అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. మున్ముందు సేంద్రియ పద్దతిలో కూరగాయలు, ఆకుకూరలు పండించి ప్రజల ఆరోగ్య రక్షణకు పాటుపడుతానని చెప్పారు. పురస్కారం అందుకునేందుకు సహకరించిన ఉద్యాన శాఖ డైరక్టర్ హనుమంతరావు, జేడీ సరోజనీ దేవి, జిల్లా అధికారి సూర్యనారాయణ, రాకేశ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, విష్ణులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News