- Advertisement -
దుబాయ్: భారత ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన వారికి మ్యాచ్ ముగిసిన తర్వాత ఉత్తమ ఫీల్డర్ పేరుతో మెడల్ బహుకరిస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి టో్ర్నీ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ అత్యద్భుతంగా ఫీల్డింగ్ చేసిన వ్యక్తిని ఆటగాడి బెస్ట్ ఫీల్డర్ అవార్డు లభించింది.
అతను మరెవరో కాదు, టీం ఇండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫైనల్‌లో చక్కటి బౌలింగ్ చేయడంతో పాటు అదిరపోయేలా ఫీల్డింగ్ కూడా చేశాడు. దీంతో ఈ మెడల్‌ను అతనకి ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మెడల్‌ని అందించారు. ‘బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ జడేజా అదరగొట్టాడు. బంతి ఆపేందుకు అతను పడిన కష్టం, దాన్ని వికెట్‌వైపు విసిరిన విధానం అద్భుతం. అందుకే ఈ మెడల్‌ను రడేజాకు అందిస్తున్నాం’ అని దిలీప్ అన్నారు.
- Advertisement -