బైక్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లో లభించే బైక్స్ లో ఏది కొనాలో అర్థం కావడం లేదా? అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే వచ్చే బైక్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ కూడా ఉన్నాయి. మీరు తక్కువ ధరలో అద్భుతమైన మైలేజీతో బైక్ కోసం చూస్తున్నట్లయితే, ఈ వార్త మీకు సరైనది అని చెప్పవచ్చు. ఇప్పుడు మార్కెట్లో లభించే బెస్ట్ మైలేజీ బైక్స్ గురుంచి తెలుసుకుందాం.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఒక స్టైలిష్ బైక్. ఇది అద్భుతమైన మైలేజీ కారణంగా మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది. అయితే ఈ బైక్ ఎకోథ్రస్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీని కలిగి ఉంది. ఇది మోటార్‌సైకిల్ ఇంధనాన్ని 15% పెంచుతుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 110 సిసి ఇంజన్ ఉంది. ఇది 8 బిహెచ్‌పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కిలోమీటరుకు 86 మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
హీరో స్ప్లెండర్ ప్లస్
‘కింగ్ ఆఫ్ మైలేజ్’గా పేరొందిన బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటి. ఇది 100 cc ఇంజన్, i3s టెక్నాలజీని కలిగి ఉంది. కాగా, ఈ బైక్ లీటరుకు 80.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
బజాజ్ ప్లాటినా 110
బజాజ్ ప్లాటినా 110లో బజాజ్ DTS-i ఇంజన్ ఉంది. అయితే, దీని సామర్థ్యం 115 cc. ఈ ఇంజన్ 8.4 బిహెచ్‌పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్, హ్యాండ్ గార్డ్‌లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ప్లాటినా 110 వస్తుంది. కాగా ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 70 కిలోమీటర్లు నడుస్తుంది.
హోండా సిడి 110
హోండా సిడి 110 డ్రీమ్ డీలక్స్ 110 సిసి ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది జపనీస్ ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీని కలిగి ఉంది. సైలెంట్ స్టార్టర్, ACG, ఈక్వలైజర్‌తో కూడిన కాంబి బ్రేకింగ్, తక్కువ-మెయింటెనెన్స్ సీల్డ్ చైన్ వంటి ఫీచర్లతో వస్తుంది. అందుకే దీని అందరూ కొనడానికి మొగ్గు చూపుతారు. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 65 కిలోమీటర్లు ఇస్తుంది.