Saturday, December 28, 2024

మీ బైక్ మైలేజ్ పెరగాలంటే ఇలా చేయండి..

- Advertisement -
- Advertisement -

ఇంధనం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, మనం వాడే మోటార్‌సైకిల్ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలనుకుంటాము. మన ఆనందం కోసం ఎక్కువగా స్పీడ్ గా వెళ్తే.. అది అనుకున్నంత మైలేజీని ఇవ్వదు. దీంతో మనం ఎప్పుడు నిరాశ చెందుతాము. ఈ క్రమంలోనే మనం మోటార్‌సైకిల్ మైలేజీని ఎలా పెంచుకోవచ్చో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

బైక్ కార్బ్యురేటర్‌ని రీట్యూన్ చేయడం ద్వారా బైక్ మైలేజీ ఇస్తుంది. ఒకవేళ బైక్ మైలేజ్ తక్కువగా ఇస్తే ఖచ్చితంగా కార్బ్యురేటర్ ని తనిఖీ చేయాలి. దీనిని సరిచేయడం ద్వారా ఇంజన్ పనితీరును మెరుగుపరుస్తుంది. బైక్ అధిక మైలేజీని కూడా ఇస్తుంది.

ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 20 సెకన్ల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తే.. బైక్ ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం. దీంతో ఇంధనం ఆదా చేయవచ్చు.

బైక్ టైర్లను ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. బైక్ కు తగినంత గాలి పట్టించాలి. ఒకవేళ దూరపు ప్రయాణం చేస్తేయ్ పెట్రోల్ పంప్ వద్ద టైర్‌లోని గాలిని ఖచ్చితంగా తనిఖీ చేయించాలి.

బైక్‌ను ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకోవాలి. బైక్ భాగాలను తనిఖీ చేయాలి. ఇది సామర్థ్యాన్ని పెంచి, పనితీరును నిర్వహిస్తుంది. దీని వల్ల బైక్ మంచి మైలేజీని ఇస్తుంది.

బైక్‌ను తయారు చేసినప్పుడు ఇంజనీర్లు దాని ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. ఇవి బైక్ పనితీరును మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి. ఒకవేళ బైక్‌లో అనేక మార్పులు చేస్తే.. ఏరోడైనమిక్స్‌ను ప్రభావితం చేయడమే కాకుండా మైలేజీని కూడా ప్రభావితం చేస్తుంది.

 

ఈ విషయాలు గుర్తించుకోండి

1. అవసరానికి తప్ప బైక్ ను వేగంగా నడపకూడదు.
2. సడన్‌గా బ్రేక్‌లు వేసి బైక్ ని ఆపకూడదు.
3. బైక్ గేర్లను సరిగ్గా ఉపయోగించాలి.
4. బైక్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News