Wednesday, January 8, 2025

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫోన్స్..

- Advertisement -
- Advertisement -

ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో గొప్ప ఫీచర్లు ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే అది కష్టంగానే అనిపిస్తుంది. ఒకవేళ మీతో రూ. 8000 కంటే తక్కువగా ఉండి, గొప్ప ఫీచర్ల గల ఫోన్ కోసం చూస్తుంటే ఈ కింద ఉన్న ఫోన్స్ మీకు అనుగుణంగా ఉంటాయి.

లావా యువ 4

లావా యువ 4 ఫోన్ 4GB + 64GB వేరియంట్ ధర రూ.6,999 గా ఉంది. కాగా, ఈ స్మార్ట్ ఫోన్ గ్లోసీ వైట్, గ్లోసీ పర్పుల్, గ్లోసీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అమ్మకానికి ఉంది. ఇక కేమెరా విషయానికి వస్తే ఇందులో 50MP ప్రైమరీ, 8MP సెల్ఫీ సెన్సార్ ఉంది. బ్యాటరీ గురుంచి మాట్లాడుతే.. 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 mAh బ్యాటరీ ఉంది. గ్లోసీ బ్యాక్ డిజైన్‌తో కూడిన ఫోన్ 6.56 అంగుళాల HD + స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే, ఈ సరసమైన ఫోన్‌లో Unisoc T606 ప్రాసెసర్ ఉంది.

టెక్నో పాప్ 9

టెక్నో పాప్ 9 ప్రారంభ ధర రూ. 6,499 గా ఉంది. ఇది 3 GB ర్యామ్‌తో 64 GB నిల్వను కూడా కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ హేలియో G50 చిప్‌సెట్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం.. వెనుక 13MP కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 8MP సెన్సార్‌ ఉంది. ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 mAh బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్ట్రైల్ బ్లాక్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్

ఒకవేళ మీకు 6000mAh బ్యాటరీతో చౌకైన స్మార్ట్‌ఫోన్ కావాలంటే, మీరు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయొచ్చు. దీని 4జిబి + 128 జిబి వేరియంట్ ధర రూ.7,799 గా ఉంది. ఇది వెనుక కెమెరా 50MP+ AI లెన్స్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీ కోసం 8MP కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ 18W ఛార్జర్‌తో ఛార్జ్ చేయబడుతుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ మీడియా టెక్ హేలియో G36 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News