Monday, December 23, 2024

పాలన వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటేనే అత్యుత్తమ ఫలితాలు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: ప్రభుత్వ పాలన వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని పురపాలక, ఐటీ శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవం సందర్బంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుపరిపాల సంస్కరణలు, ఫలితాలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హజరై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్సీ ప్రభకర్‌రావు, దయానంద్ గుప్త, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, ఖాద్రిపాషా, జాఫార్ హుస్సేన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌లతో పాటు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీలతో కలిసి పాల్గోన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతు ప్రభుత్వ పాలన వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అద్భుతమైన అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తుందన్నారు. జిల్లాల విభజనతో పాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైందన్నారు. జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణంతో వివిధ ప్రభుత్వ విభాగాలన్నిటిని ఒకే ఆవరణలోకి తీసుకురావడంతో ప్రజల సమయం వృదాకాకుండా సత్వరం వారి సమస్యల పరిష్కారమౌతున్నాయన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రక్షాళన సంస్కరణల అమలుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రగతి పథంలో శరవేగంగా దూసుకుపోతుందన్నారు. పురపాలక, పట్టణాభివృద్ది సంస్థాగత పనితీరును వార్డు స్థాయికి వికేంద్రీకరించి పౌరులకు అందుబాటులో ఉండే అవసరం ఏర్పడుతుందన్నారు.

పౌరులకు స్నేహపూర్వకమైన ప్రభుత్వ వాతావరణం ఏర్పాటు చేసి వివిధ సేవలను బాధ్యతతో అందించడమే కాకుండా పౌరులలో విశ్వాసం పెంపోందించడం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఆన్‌లైన్, కంట్రోల్ రూమ్, డయల్ 100 మొదలైన వాటి ద్వారా స్వీకరించిన ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి సంబంధిత ఫిర్యాదుదారులకు వాటి పరిష్కార వివరాలను తెలిజేయడం, వార్డులో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ పథకాలు, అభివృద్ది ప్రాజెక్ట్‌లు మౌలిక సదుపాయాల నిర్వహణను సమన్వయంతో నిర్వర్తించడం, పౌరులకు సేవలను అందించడంలో సంబంధిత అధికారులకు క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న లేదా ఏర్పాడుతున్న ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించడానికై, స్థిరమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

హైదరాబాద్ మహనగర్ పాలక సంస్థ అవదిస్తున్న వివిధ రకాల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడకు వార్డు కార్యాలయంలో పరిపాలన, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, పారిశుద్దం, పట్టణ సామాజిక అభివృద్ధివిభాగము, పట్టణ జీవ వైవిధ్యం, హైదరాబాద్ మహనగర మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహన బోర్డు, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్, ఫిర్యాదుల నమోదు, కంప్యూటర్ ఆపరేటర్ ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, పరిపాలన అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, ఉప కమిషనర్లు, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News