Monday, January 20, 2025

మాతృభాషలో విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Best results with mother tongue education:draupadi murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధ
46మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేత
తెలంగాణ నుంచి ముగ్గురికి అవార్డులు
రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాలు అందుకున్న కె రామయ్య, టిఎన్ శ్రీధర్, సునీతారావు

న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం అన్నారు. సైన్స్, సాహిత్యం, సాంఘిక శాస్త్రాలను మాతృభాషలో బోధిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ..తన గ్రామంలో స్కూలు చదువు ముగించుకుని కాలేజ్‌కు వెళ్లిన తొలి అమ్మాయిని తనే అన్నారు. ఈక్రమంలో ఉపాధ్యాయులు అందించిన తోడ్పాటును ఆమె గుర్తు చేసుకున్నారు.

మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తించి విద్యార్థులకు బోధిస్తే సైన్స్ తదితర క్లిష్టమైన సబ్జెక్టుల్లోనూ వారి ప్రతిభ మెరుగువుతుందని తెలిపారు. ప్రపంచ దేశాల విద్యావిధానంతో పోలిస్తే భారతీయ స్కూలు విద్యావ్యవస్థ ఎంతో పెద్దదిగా గుర్తింపు పొందిందని వివరించారు. ఈ సందర్భంగా ఎంపికైన 46మంది ఉపాధ్యాయులకు 2022 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేశారు. పాఠశాల విద్యాభివృద్ధికి వారు చేసిన ఎనలేని కృషిని రాష్ట్రపతి ద్రౌపది ప్రశంసించారు. కాగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

పారదర్శకంగా మూడంచెల విధానంలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతల్లో తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన ముగ్గురేసి ఉపాధ్యాయులు ఉన్నారు. తెలంగాణ నుంచి కె రామయ్య, టిఎన్ శ్రీధర్, సునీతారావులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులుమీదుగా పురస్కారాలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యాభివృద్ధికి విశేషసేవలతోపాటు విద్యార్థుల ఉన్నతికి చేసిన ఎనలేని కృషికి గుర్తింపుగా ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తున్నామని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News