Sunday, January 19, 2025

42మంది సైబరాబాద్ పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

- Advertisement -
- Advertisement -

Best Service Medals for 42 Cyberabad Police

 

హైదరాబాద్ : అత్యుత్తమ సేవలు అందించిన సైబరాబాద్ పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల నుంచి అవార్డులు అందజేస్తోంది. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు 5 గురికి ఉత్తమ సేవా పతకాలు, 37మందికి సేవా పతకాలకు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన వారు వి. భాస్కర్, ఎసిపి శంషాబాద్, షేక్ అబ్దుల్లా ఎఎసై కొత్తూరు పిఎస్, పిఓ శేఖరయ్య ఎఆర్ హెచ్‌సి, సిటిసి, ఎం. శ్రీనివాస్ హెచ్‌సి, సిసిఎస్, బి. వేణు గౌడ్ పిసి, సిఎటి ఉన్నారు. పతకాలకు ఎంపికైన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. మరింత బాధ్యతగా పనిచేయాలని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News