Monday, December 23, 2024

రూ.15,000 లోపు లభించే బెస్ట్ ఫోన్స్

- Advertisement -
- Advertisement -

కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.15000 లేదా కొంచెం ఎక్కువ బడ్జెట్‌ను కలిగి ఉన్నారా? కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? కానీ, ఏది కొనాలో మీకు అర్థం కాకపోతే అవుతలేదా? ఇప్పుడు ఈ వార్త ద్వారా కొత్త, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

పోకో ఏం7 ప్రో

ఈ జాబితాలో మొదటగా ఉన్నదీ పోకో స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6.67-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,100 nits పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్షన్ 7025 అల్ట్రా చిప్‌సెట్‌ని అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పోకో HyperOS పై రన్ అవుతుంది. ఫోటోగ్రఫి కోసం.. ఇందులో 50MP సోని లైటియ LYT-600 ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం.. 20MP కెమెరా ఉంది.ఈ ఫోన్ 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

లావా బ్లేజ్ డుయో

లావా బ్లేజ్ డుయో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. లావా అగ్ని 3 మాదిరిగానే వెనుకవైపు 1.58-అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లే కూడా ఉంది.బ్లేజ్ డుయో 5Gలో మీడియా టెక్ 7025 ప్రాసెసర్ ఉంది. ఫోన్ గరిష్టంగా 8GB LPDDR5 మెమరీ, 128GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోల కోసం ఈ ఫోన్లో 64MP ప్రైమరీ షూటర్, 2MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP షూటర్ ఉంది.

రియల్ మీ 14x

రియల్ మీ 14x స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 1604×720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 625 nits పీక్ బ్రైట్‌నెస్, 89.97 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. పనితీరు కోసం..మీడియా టెక్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంది. పరికరం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 6GB + 128GB, 8GB + 128GB. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఇందులో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News