Thursday, January 23, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

ముగ్గురికి జాతీయ
ఉత్తమ ఉపాధ్యాయ
పురస్కారాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రకటించింది. గురువారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు టి ఎన్ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య, హైదరాబాద్‌లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతారావుకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు దక్కాయి. వచ్చేనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డుల్ను అందజేయనున్నారు. కాగా, దేశవ్యాప్తంగా 46 మంది టీచర్లను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News