Wednesday, January 22, 2025

తెలంగాణ టీచరు రాజశేఖర్‌కు జాతీయ సైన్స్ ఫెస్టివల్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో తెలంగాణకు చెందిన యువ ఉపాధ్యాయుడు టి రాజశేఖరరావు తన ప్రతిభ చాటుకున్నారు. సామాన్య జనజీవితానికి శాస్రీయ అవగావహన కల్పించేందుకు పాటుపడుతున్న ఈ ఉపాధ్యాయుడిని సైన్స్ విభాగంలో జరిగిన పద్యరచనల పోటీలో ప్రధమ ర్యాంక్ దక్కింది, ఇండియన్ సైన్స్ ఫెస్టివల్2023 మూడురోజుల పాటుసాగింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెన్నచర్ల పాఠశాలలో పనిచేసే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రాజశేఖర్ తన వినూత్న ఆవిష్కరణల ఫలితంగా ఈ సైన్స్ పురస్కారం పొందారని నిర్వాహకులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ ఫెస్టివల్‌కు 108 మంది ఎంపికకాగా, తెలంగాణ నుంచి ఎంపికైన రాజశేఖర్‌కే పురస్కారం అందింది. రాజశేఖరరావుకు జాతీయ బాలభవన్ ప్రతినిధి మధుపంత్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ అరవింద్ రణడే అభినందన పత్రాలను అందించారు. గ్రామీణ ప్రాంతాలలో సైన్స్ పట్ల ప్రజలలో మరింతగా అవగావహన కల్పించాల్సి ఉందని, దీనిని కేవలం వారికి అందుబాటులో ఉండే రచనల ద్వారానే కల్పించేందుకు వీలుంటుందని పురస్కార గ్రహీత రాజశేఖర్ తెలిపారు. ఈ పురస్కార స్ఫూర్తితో తాను ఇక ముందు మరింతగా అంకితభావంతో ముందుకు వెళ్లుతానని ‘ మన తెలంగాణ’ పత్రికకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News