Saturday, December 21, 2024

బెస్ట్ టెక్నికల్ ఫిలిం ఆఫ్ ది వరల్డ్ ‘కెజిఎఫ్ 2’

- Advertisement -
- Advertisement -

Best Technical Film of the World ‘KGF2’

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కెజిఎఫ్ చాప్టర్ 2’. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కెజిఎఫ్’కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్ 14న తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా కన్నడ ట్రైలర్‌ను శివ రాజ్ కుమార్ విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్‌ను బాగా ఎంజాయ్ చేశాను. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కింది”అని అన్నారు.

రాకింగ్ స్టార్ యష్ మాట్లాడుతూ “కెజిఎఫ్ చాప్టర్ 1 విజయం క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్‌కే దక్కుతుంది. ఈ సినిమా తన కల. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ను ప్రశాంత్ సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కించాడు. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది”అని తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “8 ఏళ్ల ముందు కెజిఎఫ్ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. కన్నడలో ప్రారంభమైన ఈ సినిమా ప్రయాణం ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రయాణంగా మారింది. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ను వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికల్ ఫిలిం ఆఫ్ ది వరల్డ్ అని చెప్పగలను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మంత్రి అశ్వత్ నారాయణ్, చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, బాలీవుడ్ స్టార్లు సంజయ్‌దత్, రవీనా టాండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, రాధిక, ఎస్.ఆర్.ప్రభు, రితేష్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News