Wednesday, January 22, 2025

ఇండియాలో పర్యటించాల్సిన రాష్ట్రం ఒక్కటేనా?…

- Advertisement -
- Advertisement -
‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొన్న ఆ రాష్ట్రం?

వాషింగ్టన్: సంవత్సరాదిన ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది చూడాల్సిన 52 ప్రదేశాలను ప్రచురించింది. వాటిలో నార్వేలో ట్రోమ్‌సో, న్యూజిలాండ్‌లోని ఆక్‌లాండ్ వంటివి ఉన్నాయి. ఆ వార్తా పత్రిక అడ్వెంచర్, ప్రకృతి సౌందర్యం, సంస్కృతి వంటి విషయాలను కూడా పేర్కొంది. ఆసియాలో పర్యటించాల్సిన గమ్యస్థానాలుగా వియత్నాం, జపాన్, భూటాన్, ఇండియాలను పేర్కొంది.

వియత్నాంలో పర్యటించేవారికి హా గియాంగ్ ఎత్తైన ప్రాంతాలలో ఉల్లాసకరమైన బైక్ రైడ్‌ని సిఫార్సు చేసింది. ఇక జపాన్‌లో సుందరమైన మోరియోకా, క్యుషు ద్వీపంలోని స్ట్రీట్ ఫుడ్ హెవెన్‌ను సందర్శించమంది. భూటాన్‌లో 250 మైళ్ల ట్రాన్స్ భూటాన్ ట్రయల్‌లో నడవమంది.

ఇండియా విషయానికి వచ్చేప్పటికి కేరళను చూడదగిన ప్రదేశంగా పేర్కొంది. అక్కడ నీటికయ్యలు(బ్యాక్‌వాటర్స్), బీచ్‌లు బాగుంటాయని పేర్కొంది. అంతేకాక కేరళ అనేక పర్యాటక అవార్డులను గెలుచుకున్న ప్రదేశంగా పేర్కొంది. కేరళ 2022లో మూడు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అందులో ‘ద గ్లోబల్ విజన్ అవార్డ్2022’ను ప్రత్యేకంగా పేర్కొనాలి. కేరళ ‘రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్’ను అమలు చేస్తోంది. కేరళ టూరిజం ద్వారా మూడు లక్ష్యాలు సాధించాలనుకుంటోంది. ఒకటి గ్రామాలను, స్థానిక కమ్యూనిటీలను అభివృద్ధి చేయడం, రెండోది, పేదరికాన్ని నిర్మూలించడం, మూడోది, మహిళల సాధికారతపై దృష్టి పెట్టడం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News