Thursday, January 23, 2025

బిఆర్ఎస్ కు బిగ్ షాక్…. మాజీ ఎంఎల్ఎ రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాశారు. తన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కొత్తగా వచ్చిన బండారు లక్ష్మణ్ కు అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఇచ్చి తనని అవమాన పరిచారని వాపోయారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ తనకు తెలియకుండా రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారని మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి, తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఈటెల రాజేందర్ తరపున ప్రచారం చేసి గెలిపించుకుంటానని లేఖలో వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News