Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో కార్పిరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఇల్లెందు ఎంఎల్‌ఎబానోత్ హరిప్రియ నాయక్ పేర్కొన్నారు. మండలంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవం నిర్వహించిన మన ఊరుమనబడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మహ్మాతా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ… మన ఊరు మన బడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు సియం కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంఎల్‌ఎను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వీరబాబు, తహశీల్దార్ వీరభద్రం, సర్పంచ్ బోడ సరితా, ఎంపిటిసి జాలాది అప్పారావు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు వరప్రసాద్, బోడ బాలు నాయక్, జిల్లా నాయకుడు బానోత్ రామానాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News