Monday, January 20, 2025

త్రివిధ దళాల మధ్య మెరుగైన సమన్వయం

- Advertisement -
- Advertisement -

చింతన్ బైఠక్‌లో సిడిఎస్ పిలుపు

న్యూఢిల్లీ: సాయుధ దళాల మధ్య సంయుక్త విధి నిర్వహణను రూపొందించాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఒక్కో దళంలోని సామర్ధాలను గుర్తించి వాటిని ఇతర దళాలతో సమన్వయం చేసి దేశ సాయుధ దళాల సమగ్ర పోరాట పటిమను పెంచుకోవాలని ఆయన సూచించారు. పరివర్తన్ చింతన్ పేరిట సోమవారం నాడిక్కడ మొట్టమొదటిసారి త్రివిధ దళాలతో సముక్తంగా నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి సిడిఎస్ ప్రసంగిస్తూ త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని, సమైక్యతను రూపొందించడానికి కొత్త ఆలోచనలను, సంస్కరణలను పంచుకోవాలని ఆయన కోరారు. అండమాన్ నికోబార్ కమాండ్ అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అధిపతులు, నేషనల్ డిఫెన్స్ అకాడమి, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, మిలిటరీ ఇన్‌స్టిట్యూ ఆఫ్ టెక్నాలజీ కమాండెంట్లు, సాయుధ దళాల ప్రత్యేక ఆపరేషన్స్ డివిజన్, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, డిఫెన్స్ కమ్యూనికేషన్ ఏజెన్సీ అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇంటెగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్(ఐడిఎస్) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కాగా..తమ దళం పనితీరుతోపాటు సంయుక్తంగా ఎలా పనిచేయవచ్చో తెలియచేస్తూ మూడు దళాలు తమ ఆలోచనలను ఈ సమావేశంలో పంచుకున్నట్లు తెలిసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కొన్ని యూనిట్లన్లు ఒకే గొడుగు కిందకు వచ్చి ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులో సంయుక్తంగా పనిచేయడానికి సంబంధించిన రోడ్డుమ్యాపు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News