Saturday, November 16, 2024

యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు

- Advertisement -
  • 2కె రన్‌ను ప్రారంభించిన మంత్రి
    సూర్యాపేట: ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ నుండి మినీ ట్యాంక్‌బండ్ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలితాలను కొత్త తరం అనుభవించాలన్నారు. యువతి, యువకులు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని అన్నారు. స్వరాష్ట్రంలో యువత సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. 2014కు ముందు కంటే తొమ్మిదేళ్ళ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు.
  • యువత చెడు వ్యసనాలకు బానిక కాకుండా జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు విద్య, ఉపాధి మార్గాల అన్వేషణపై దృష్టి పెట్టాలన్నారు. పేద విద్యార్తులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్యాభ్యాసానికి స్కాలర్‌షిప్ అందిస్తుందన్నారు. మన ఉద్యోగాలు మనకు దక్కాలనే ఉద్దేశ్యం, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో శాస్త్రీయత లోపించడంతో సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థలో సమూలంగా మార్పులు చేపట్టారన్నారు. 95శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతానికే దక్కడమే లక్షంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకవచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.
  • రాష్ట్రం సిద్దించాక గ్రామాల్లో రోడ్డుమార్గం, నిరంతర విద్యుత్, కొత్త జిల్లాలు, మండలాలలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో సుపరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, పోలీస్ అధికారులు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News