Monday, January 27, 2025

గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన : సిహెచ్ ఉపేంద్ర

- Advertisement -
- Advertisement -

Better education in Gurukul: CH Upendra

హైదరాబాద్ : మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో బిసి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రవేశాలు పొందాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యుడు సిహెచ్ ఉపేంద్ర కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 28వ తేదీ చివరి తేదీ అని వెల్లడించారు. మే 8వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. బిసి కులాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు వీలుగా ప్రతి ఒక్కరు చొరవ చూపాలని కోరారు. వెబ్‌సైట్ http://tgcet.cgg.gov.inలో ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో అనుభవజ్ఞులైనఉపాధ్యాయుల బోధన ఉంటుందని, ఐఐటి, జెఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇస్తారని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News