Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

- Advertisement -
- Advertisement -

వాజేడు : ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్య అందిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

మండలకేంద్రంలోని నాగారం ఎంపిపిఎస్ పాఠశాలలో మన ఊరు మన బడి పాఠశాలను ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన విద్య అందించడంతో పాటు విధ్యార్థులకు మౌలిక సదుపాయలు కల్పింస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విధ్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తోందని అన్నారు.

పిల్లలు ప్రతిఒక్కరూ తప్పని సరిగా చదువుకోవలని ఆమె కోరారు. ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే వారి కుటుంబ పరిస్థితి ఏంటి అని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అనంతరం పిల్లలకు పాఠ్య పుస్తకాలు, పాఠశాల యూనిఫాంలు, పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.

పాఠశాలలోని విద్యార్థులకు రాగి జావను ఆమె అందించి విద్యార్థులు తప్పనిసరిగా ఈ రాగి జావను తాగితే మచిదన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో విజయ, ఎంఇవో తేజవత్ వెంకటేశ్వర్లు, ఎంపివో శ్రీకాంత్, మండల ప్రత్యేక అధికారి సర్దార్ సింగ్, కో ఆప్షన్ సభ్యులు నిజాముద్దీన్,ఉప సర్పంచ్ కల్లూరి సతీష్ ఉపాధ్యాయులు బాలజీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News