Friday, November 22, 2024

ఆటపాటలతో మెరుగైన విద్య

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతిని వివరించాలి
బడిబాటతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి : కలెక్టర్
నాగర్‌కర్నూల్ : బడిబాట కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, గుణాత్మక విద్య బోధనాంశాలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బడిబాట నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ నెల 3 నుంచి 17 వరకు బడి బాట కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగనుందని తెలిపారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. పాఠశాలల ఉపాధ్యాయులను, అధికారులు సంసిద్ధులను చేయడం తో పాటుగా బడి బయట పిల్లలను గుర్తించి బడి ఈడు పిల్లలను సర్కార్ బడులో చేర్పించడమే లక్షంగా ముందుకు సాగాలన్నారు. ఈ నెల 3 ను ంచి 17వ తేది వరకు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలన్నారు. జిల్లాలోని 825 పాఠశాలల్లో నమోదు శాతాన్ని అధికంగా పెంచే ది శగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలపై ప్ర జల్లో నమ్మకం కలిగించి వారిలోని అపోహలను తొలగించేందుకు ఉపాధ్యాయులు బడిబాట ద్వారా కృషి చేయాలన్నారు.

నాణ్యమైన విద్య అందిస్తున్న తీరుతో పాటు బడుల్లోని బోధన, సదుపాయాలు, సాధించిన ఫలితాలతో తల్లిదండ్రుల వి శ్వాసాన్ని పొందేందుకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో కలిసి ప్రయత్నించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వం అ ందిస్తున్న నాణ్యమైన విద్య, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సదుపాయలను వారికి తప్పనిసరిగా వివరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులు నమోదు శాతాన్ని గణనీయంగా పె ంచాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్, అదనపు ఎస్పి రామేశ్వర్, డి ఈఓ గోవిందరాజులు, జిల్లా మహిళా శిశు సంక్షే మ శాఖ అధికారిని వెంకటలక్ష్మి, లేబర్ అధికారి ఫసీద్దిన్, సెక్టోరియల్ అధికారులు బరపటి వెంకటయ్య, నూరుద్దీన్, షర్పుద్దీన్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News