Monday, November 18, 2024

మహబూబ్‌నగర్ పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాల కల్పించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహబూబ్‌నగర్ పట్టణంలోని పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టులకు మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించాలని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ పర్యాటక భవన్లో ఈ మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ట్యాంక్ బండ్, శిల్పారామంలలో అంతర్జాతీయ స్థాయిలో మౌళిక సదుపాయాల కల్పనపైఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా , ఎండి మనోహర్, టూరిజం కన్సల్టెంట్‌లు పాల్గొనగా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు సూచనలు చేశారు.

మహబూబ్‌నగర్ ట్యాంక్ బండ్‌లోని హైలాండ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా అక్కడ మ్యూజికల్ ఫౌంటెన్, డైనమిక్ లైటింగ్ సిస్టం ( ఆర్‌జిబి లైటింగ్) , గ్లో గార్డెన్, ఇన్‌ఫ్లామాటర్ వాటర్ స్పోర్ట్, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుపై మంత్రి పలు సూచనలు చేశారు. మహబూబ్ నగర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మిస్తున్న ఈ శిల్పారామంలో ఏర్పాటు చేస్తున్న జెయింట్ వీల్, లేజీ రివర్ రైడ్, కొలంబస్, వేవ్ పూల్, వాటర్ రైడ్స్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ లను ఎంతో అద్భుతంగా , వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్‌తో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహబూబ్ నగర్ పట్టణం అతి సమీపంలో ఉందని, దేశ విదేశీ టూరిస్టులు వచ్చినా ఆయా పర్యాటకులను ఆకర్షించడానికి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News