Wednesday, January 22, 2025

మెరుగైన వైద్యం ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు కార్పోరేట్ స్ధాయిలో మెరుగైన వైద్యం అందించడం కోసమే చికిత్సకు ముందు చికిత్స తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేయడం జరుగుతుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 10 లక్షలు విలువ గల సిఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కులను హుజూర్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీనవర్గాల వా రి కోసం తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన వారందరూ సద్వినియోగపర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందజేస్తున్న సంక్షేమ పధకాలు యా వత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో చేపట్టిన పనులను ఒక్కొక్కటిగా వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి, కడియాల రామకృష్ణ, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చిట్యాల అమర్‌నాద్ రెడ్డి, ప్రధానకార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News