Wednesday, January 22, 2025

బి.టెక్‌తోనే మెరుగైన ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీతోనే భారీ ప్యాకేజీలతో టాప్ కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తుండటంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎవరైనా ఎం.టెక్ చదివినా అదనపు అర్హతకు ఎక్కువ జీతాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది బి.టెక్‌తోనే ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. అధ్యాపక వృత్తి లో వేతనాలు తక్కువగా ఉంటుండంతో అటువైపు ఆసక్తి చూపడం లేదు. పిజి చేయాలనుకునే వారిలో ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఎంఎస్ చదువుకుంటున్నారు.

రాష్ట్రంలో ఎం.టెక్ చేయడం వల్ల అదనంగా ప్రయోజనం లేకపోవడంతో ఇంజనీరింగ్ పిజి చేయడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్‌లో ఏటా కంప్యూటర్ సైన్స్, రొబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ వంటి కోర్సులు క్రమం గా పెరుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలు చాలా వరకు సంప్రదాయ కోర్సుల సీట్లను తగ్గించుకుని సిఎస్‌ఇ, ఇతర ఎమర్జింగ్ కోర్సుల సీట్లను పెంచుకుంటున్నాయి. కంప్యూటర్ సైన్సు చదివిన విద్యార్థులకు బి.టెక్‌తోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మెరుగైన ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో బి.టెక్‌తోనే చదువు ఆపేసి విద్యార్థులు ఉద్యోగాల్లో చేరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News