Tuesday, November 5, 2024

నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని నాంపల్లి ఏరియా ఆసుపత్రి సివిల్ సర్జన్ రేడియాలజిస్ట్ డాక్టర్ షేక్ మహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘మనతెలంగాణ’తో మాట్లా డుతూ ఆసుపత్రిలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు, వైద్యులంతా సమన్వయంతో రోగులకు నయాపైసా ఖర్చు లేకుండా విశ్వసనీమైన వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తుండటంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైద్యరంగం ఎంతో మెరుగు పడిందని, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ తో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, యంత్రాలు అందుబాటులోకి రావడంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. నా ంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతినిత్యం 1300 నుండి 1600 మంది రోగులు ఔట్ పేషంట్లుగా చికిత్సలు పొందుతుండగా, వారిలో 200 మందికి పై గా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి రోగ నిర్దారణ పరీక్షల కోసం వస్తుంటారని వెల్లడించారు. వారందరికీ సత్వరమే రోగ నిర్దారణ పరీక్షలు నిర్వ హించడంతో పాటు వెంటనే నివేదికలు అందిస్తుండటంతో సంబంధిత వైద్యులు ఆయా రోగులకు అవసరమైన చికిత్సలను వెంటనే ప్రారంభించేందుకు అనువుగా ఉండటంతో పాటు రోగులు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుందని చెప్పారు.

ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్విరామంగా రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో కార్పోరేట్ స్థాయి వైద్య సేవలను నయాపైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నామని, పేద రోగులు, పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యంతో ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రు లకు వెళ్లి, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవం తమైన జీవనం సాగించాలని డాక్టర్ షేక్ మహ్మద్ షరీఫ్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News