Monday, December 23, 2024

మాతాశిశువు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరులోని మాతాశిశువు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ప్రతి నెలా ఐదు వందలకు పైగా ప్రసవాలు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తాండూరు మూడో స్థానంలో ఉందన్నారు. తాండూరులోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఏడాది క్రితం ఏర్పాటు చేసిన మాతాశిశువు ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, పసిపిల్లలకు అన్ని విధాలుగా మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ సేవలు, పసి పిల్లలకు ఎస్‌ఎన్‌సియు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మాతాశిశువు ఆసుపత్రిలో ఇప్పటి వరకు సుమారుగా పదివేల వరకు ప్రసవాలు జరుగగా అందులో 6500 నార్మల్ ప్రసవాలు, 3500 ఆపరేషన్ ప్రసవాలు చేయడం జరిగిందన్నారు.

మాతా శిశువు ఆసుపత్రిలో 150 పడకలతో పాటు ఆరుగురు గైనకాలజిస్టు డాక్టర్లు, ఆరుగురు పిడియాట్రిషన్ డాక్టర్లు, ఆరుగురు మత్తు డాక్టర్లు అందుబాటులో ఉండి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఆసుపత్రిలో పారిశుద్ధం మెరుగుగా ఉండే విధంగా ఎప్పటికపుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పేద, గొప్ప అనే అభిప్రాయ బేదాలు లేకుండా ఆసుపత్రికి వచ్చిన వారందరికి మెరుగైన సేవలు అందించడంతో ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రిలో ప్రసవం చెందిన మహిళలకు కెసిఆర్ కిట్‌లు అందిస్తున్నామన్నారు. అదే విధంగా ఐదేళ్లలోపు బలహీనంగా ఉన్న పిల్లలకు ఎన్‌ఆర్‌సియు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యూట్రిషన్ కిట్లు కూడా అందజేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News