Saturday, December 21, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతున్నదని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా, ఇక్కడి వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా ప్రధాన కేంద్రంలోని మాతాశిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణలు ప్రసూతి వార్డులో ఉన్న పేషంట్లకు పండ్లు అందించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలతోపాటు జనరల్ సర్జరీలు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవల కోసం అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

అనంతరం బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ఎంతో మందికి విపత్కర పరిస్థితుల్లో రక్తం అవసరం అవుతుందని, ఆరోగ్యంగా ఉన్న వారందరు రక్తం ఇచ్చేందుకు స్వచ్చందగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, వ్యవసాయ కమిటీ చైర్మన్ సురేందర్, జడ్పీటీసీ రామ్మూర్తి, డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, డాక్టర్ వాసుదేవ రెడ్డి, డాక్టర్ శౌరయ్య, ప్రజాప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News