Monday, December 23, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

వికారాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరిక రాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.25 లక్షలతో నూతన కంటికి సంబంధించిన మిషన్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో 10 జిల్లాలకు మిషన్‌లు మంజూరు కాగా అందు లో మన వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకొని ప్రారం భించడం జరిగిందన్నారు. శరీర భాగాలలో కండ్లు ముఖ్యమైనవని అలాంటి కంటి వైద్యం పేద ప్రజలకు అందించడానికే అత్యధికమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆసు పత్రిలోని ఓపి, తదితర వైద్య సేవలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News