Friday, November 15, 2024

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి ః పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడుతూ వైద్యం ఎలా అందుతుంది, వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఓపి లైన్‌లో ఉన్న రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.

ఇద్దరు వైద్యులు చాలా రోజులు విధులకు హాజరు కావడం లేదని జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి విధుల పట్ల నిర్లక్షం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బాలింతలకు, చిన్న పిల్లలకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారని, అందుకే ఓపిల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఆయన వెంట మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ శివరాం, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News