Wednesday, January 22, 2025

‘విలేజ్ బస్ ఆఫీసర్’తో ప్రయాణికులకు మెరుగైన సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఎండిగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసి డిపోల్లో ‘విలేజ్ బస్ ఆఫీసర్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ‘విలేజ్ బస్ ఆఫీసర్’ కార్యక్రమాన్ని డిపో మేనేజర్‌తో పాటు మలక్‌పేట్ ఎసిపి సంపత్ కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ ప్రయాణికులకు మరింత దగ్గరై వారి సలహాలు,

సూచనలు తీసుకొని, ఆర్టీసికి ప్రయాణికులకు మధ్య వారధిగా ఉంటూ మెరుగైన సేవలందించాలని ఆయన సూచించారు. ఆర్టీసిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు. డిపో మేనేజర్ డి.హరి మాట్లాడుతూ ఈ ‘విలేజ్ బస్ ఆఫీసర్’ కార్యక్రమంతో ప్రయాణికులకు మరింత చేరువకావచ్చన్నారు. ఆర్టీసి అందిస్తున్న రాయితీలను, సీజనల్ టికెట్స్, బస్‌ఆన్ కాంట్రాక్ట్ గురించి చెప్పాలని తెలియచెప్పాలని ఆయన విబిఓలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News