Monday, January 27, 2025

నిరుపేదలకు అండగా సర్కారు వైద్యం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో పేద ప్రజలకు అండగా సర్కారు వైద్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తుదన్నది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య పెరుగుతున్ది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, సుల్తానాబాద్, మంథని ఆరోగ్య కేంద్రాలలో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నది. ఈ ఏడాది మే 3న వైద్యా రోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకున్న తర్వాత, హై రిస్క్ కేసులను సైతం కరీంనగర్ ఆసుపత్రికి తరలించకుండా పెద్దపల్లిలోనే మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు.

టీవీవీపీ ఆసుపత్రులలో గణాంకాలు పరిశీలిస్తే పెద్దపల్లి ఆసుపత్రిలో ఆగస్టులో నెలలో 140 ప్రసవాలు, సెప్టెంబర్‌లో 180, అక్టోబర్ నెలలో అత్యధికంగా 244, నవంబర్‌లో 215 ప్రసవాలు జరిగాయి.గతంలో కేవలం నెలకు 100 నుంచి 120 వరకు జరిగితే గత నాలుగు మాసాలుగా సరాసరి 200లకు పైగా నమోదయ్యాయి. సుల్తానాబాద్ 30 పడకల ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తృతంగా అందించడంతో పాటుగా, ప్రత్యేకంగా గైనకాలజిస్టు, అనస్థీషియా, పెడిట్రిషియన్ వైద్యులను నియమించి గతంలో నెలకు జరిగే 15 ప్రసవాల సంఖ్యను 40కు పెంచడం జరిగింది. మంథని ఎంసీహెచ్‌ను సన్నద్ధం చేసి నెలకు 40వరకు ప్రసవాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలతోపాటు జనరల్ సర్జరీలు, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. పెద్దపల్లి ఆసుపత్రిలో గత నెల ఆరోగ్య శ్రీ కింద 50 జనరల్ సర్జరీలు, 10 ఆర్థోపెడిక్ ఆపరేషన్లు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను పేదలకు అందిస్తున్నారు.అలాగే ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు అవసరమైన పారిశుద్య, డైట్ టెండర్లు పూర్తి చేసి ఏజెన్సీల ద్వారా పకడ్బందీ సేవలు అందిస్తున్నారు. జిల్లాలో టీవీవీపీ పరిధిలో 7 ఎంబీబీఎస్ వైద్యులు, ముగ్గురు ప్రత్యేక వైద్యులు మొత్తం 10 మందిని తాత్కలికంగా నియమించి ప్రజలకు సేవలందిస్తున్నారు.
పెద్దపల్లిలో డయాలిసిస్ సెంటర్, మంతని బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు చర్యలు
పెద్దపల్లి ఆసుపత్రిలో మంజూరు చేసిన 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కావాల్సిన ఎంఓయూ పూర్తి చేశారు. త్వరలో పెద్దపల్లిలో డయాలసిస్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మంథని ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
మెరుగైన వైద్య సేవలు పెద్దపల్లిలో లభ్యం
ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం లేదని, పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో లభ్యమవుతాయని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులతో ప్రేమగా, మర్యాదగా ప్రవర్తించేలా వైద్య, నర్సింగ్, పారిశుద్ధ, సిబ్బందికి శిక్షణ అందించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, అబ్‌స్ట్రాటిక్స్ మొదలైన వివిధ రకాల స్పెషలిస్టులతో వైద్య సేవలు విస్తృతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News