హైదరాబాద్ : తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ సంజీవ్ నాయక్‌ను నియమించినట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు ప్రకటించారు. టిఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్,గంధం రాములు సమక్షంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ సంజీవ్ నాయక్‌కు ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ప్రస్తుతం మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు చెందిన ఓయూ గిరిజన రాష్ట్ర నేత డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. ఇటీవల రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ చైర్మన్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదిన పురస్కరించుకొని డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ స్కూల్ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారని వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన గంధం రాములుకు కృతజ్ఞతలు తెలిపారు.