Saturday, November 2, 2024

నగరవాసులకు మెరుగైన సేవలు అందిస్తాం: మేయర్

- Advertisement -
- Advertisement -

Better services to hyderabad's

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరవాసులకు మరింత మెరుగైన సేవలు, సదుపాయాలు అందించేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్‌ఎంసి జోనల్ కమిషన్లతో పాటు వివిధ విభాగాల అధికారులను అదేశించారు. కూకట్ పల్లి జోన్‌కు సంబంధించి జోనల్ కమిషనర్ మమతతో కలిసి మేయర్ సోమవారం కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో సోమవారం సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి కమిషనర్లు, ఇంజనీరింగ్, శానిటేషన్, వైద్య, ఎలక్ట్రిసిటీ, యు.సి.డి, యు.బి.డి డిప్యూటి కమిషనర్లు, ఇంజనీరింగ్, శానిటేషన్, వైద్య, ఎలక్ట్రిసిటీ, యు.సి.డి, యు.బి.డితో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ్ర పభుత్వ ప్రధాన లక్ష్యమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఇ.ఓ.డి.బి) ద్వారా సిటీజన్స్ సర్వీసెస్ ఎవరి ప్రమేయం లేకుండా జిహెచ్‌ఎంసి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్, ట్రేడ్ లైసెన్స్, టి.ఎస్.బి.పాస్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ ఇతర సర్వీసులను నగరవాసులకు అందించడంలో ముందంజలో ఉండాలంటూ అధికారులకు దిశా నిర్దేశనం చేశారు.

కూకట్ పల్లి జోన్ లోని 22 వార్డులలో మంజూరు చేయబడిన గ్రేవ్ యార్డ్ లను మోడల్ గ్రేవ్ యార్డులుగా తీర్చిదిద్దాలని, 219 కమ్యునిటీహాల్స్ ను మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా వినియోగంలో లేని కమ్యునిటీహాల్స్ ను జోనల్ కమిషనర్ ఆమోదంతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. జోనల్‌లోని 440 టాయిలెట్స్ ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లు సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవడంతో పాటు జోనల్ వారిగా షీ-టాయిలెట్స్ నిర్వహణపై సంబంధిత అధికారులు పూర్తి సమాచారం కలిగి ఉండాలని అన్నారు. ఫుట్ పాత్ ల ఆక్రమణలు జరుగకుండా దృషి సారించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. జోనల్ పరిధిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను జోన్ లోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు..

మంజూరు చేయబడిన థీమ్ పార్కులను పూర్తిస్థాయిలో నిర్మించి ప్రారంభానికి సిద్దంగా ఉంచాలని తెలిపారు. చెట్ల కొమ్మల వల్ల ఎలక్ట్రిక్ వైర్లు పాడవకుండా ప్రతి కాలనీలో ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షకాలం నాటికి ఎస్.ఎన్.డి.పి ద్వారా కూకట్ పల్లి పరిధిలోని నాలా పనులను పూర్తి చేయాలన్నారు. ్వచ్ఛ సర్వేక్షన్ అనేది 365 రోజుల కార్యక్రమం, ఇందులో ఎస్.ఎఫ్.ఏ లు, జవాన్లు, శానిటరీ సూపర్ వైజర్స్, ఏ.ఎం.ఓ.హెచ్, డిప్యూటి కమిషనర్లు నిరంతరాయంగా పర్యవేక్షించాలని, వాట్సప్ ల ద్వారా ఫోటోలు కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. ఏ.ఎం.ఓ.హెచ్ లు, డిప్యూటి కమిషనర్లు స్వీపింగ్ మిషన్ల పనితీరును స్వయంగా పరిశీలించాలన్నారు.

ఇందులో నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటి కమిషనర్లు ప్రజా ఫిర్యాదులపై చాలా మర్యాదపూర్వకంగా నిర్ణీత సమయంలో పర్కిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటి కమిషనర్ అన్ని శాఖలకు వారధిగా పనిచేయాలన్నారు. సిటీజన్ సర్వీస్ సెంటర్లను పటిష్టంగా పనిచేసేందుక చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ -19 సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతికంగా అందుబాటులో ఉండి సరియైన సమాచారం ద్వారా మార్గనిర్దేశం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్.ఇ చిన్నారెడ్డి, సిటీ ప్లానర్ ఉమాదేవి, ఏ.ఎం.సి శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటి కమిషనర్లు ప్రశాంతి, నాగమణి, మంగతయారు, రవికుమార్, రవీందర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News