Monday, January 20, 2025

నూతన విధానాలతో మరింత ఉత్తమ సేవలు

- Advertisement -
- Advertisement -

బోయిన్‌పల్లి: ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలను అందించటానికి వారు ఎదర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కరానికి వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయటం జరిగిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉదయం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలో వార్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మయాదవ్‌తోకలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని అందులో భాగంగా నూతనంగా వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు.

మొత్తం 150 డివిజన్‌లో వార్డు కార్యాలయాలను ప్రారంభించటం జరిగిందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరి సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని ఏఒక్క కులం మతం కోసం బిఅర్‌ఎస్ పనిచేయదని అన్నారు. అందుకు నిదర్శనమే మనం ఇక్కడ చేస్తున్న సర్వమత ప్రార్థనలని అన్నారు. వార్డు కార్యాలయాల్లో నిత్యం విద్యుత్తు, జలమండలి, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, యుబిడి, ఇంజనీరింగ్, ఎంటమాలజీ తదితరు శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని డివిజన్‌కు చెందిన ప్రజలకు సమస్యలను వార్డు కార్యాలయంలో విన్నవించవచ్చని సమస్య విన్నవించిన వెంటనే 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలని ఆయన తెలిపారు.

ఇలాంటి కార్యక్రమాలు దే శంలో ఎక్కడా లేవని ముఖ్యమంత్రి కెసిఅర్ ఆలోచన ముందు చూపుతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంను ఆగ్రపథంలో స్థానంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈ ఈ గోవర్ధన్‌గౌడ్, డిఈ బాలకృష్ణ, ఏఈ అరవింద్, జలమండలి సిజిఎమ్, విజయ్‌రావు, జిఎమ్. ప్రభాకర్, ఏఈ తేజ, విద్యుత్తుశాఖ ఏడి కృష్ణ, ఏఈ అఖిల్, బిఅర్‌ఎస్ నాయకులు నరేందర్‌గౌడ్, కర్రెజంగయ్య, బల్వంత్‌రెడ్డి, మక్కల నర్సింగ్‌రావు, స య్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, మేకల హరినాథ్, గడ్డం నర్సింగ్‌రావు, బుర్రియాదగిరి, మట్టి శ్రీనివాస్, పిట్ల రాజు ముదిరాజ్, కర్రె లావణ్య, లలిత, దుర్గా, రోజా, శశికళ, దేవి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News